Andhra Pradesh: చంద్రబాబుపై నాకు చాలా కోపం ఉంది.. డబ్బులుంటే ఆయనపై 1996లోనే సినిమా తీసేదాన్ని!: లక్ష్మీ పార్వతి

  • వర్మ నన్ను ఇంతవరకూ కలవలేదు
  • నా అభిప్రాయాన్ని తీసుకోలేదు
  • నగదు లేకపోవడంతోనే సినిమా తీయలేకపోయా

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను సంప్రదించలేదని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని వెల్లడించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాకు తాను ప్రొడ్యూసర్ కాదనీ, తనకు అంత ఆర్థిక స్థోమత లేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

‘ఒకవేళ నిజంగా అన్ని డబ్బులు నా దగ్గర ఉంటే 1996లోనే చంద్రబాబుపై సినిమా తీసేదాన్ని’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తనకు అంత కోపం ఉందన్నారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక నిస్సహాయత కారణంగానే తాను మౌనంగా ఉండిపోయానన్నారు. ఇప్పుడెవరో వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తూ ఉంటే దాన్ని తనకు అంటగట్టడం భావ్యం కాదన్నారు.

Andhra Pradesh
Chandrababu
ntr
ram gopal varma
lakshmies ntr
cas
lack of
money
lakshmi parvathy
  • Error fetching data: Network response was not ok

More Telugu News