Andhra Pradesh: ఏపీకి కేసీఆర్ వస్తే సంతోషమంటూనే.. విమర్శించిన చంద్రబాబు!

  • ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకే కేసీఆర్ పర్యటన
  • ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం రావట్లేదు
  • ఈవీఎంలతో కుమ్మక్కైతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఈ నెల 23 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నట్టు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఏపీకి కేసీఆర్ వస్తే సంతోషమేనన్న చంద్రబాబు మరోపక్క విమర్శలూ చేశారు. ప్రజల్లో అయోమయం, గందరగోళం రేకెత్తించేందుకే కేసీఆర్ పర్యటించనున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ, ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం రావట్లేదని, పోల్ అయిన ఓట్ల కంటే కౌంటింగ్ లో ఓట్లు ఎలా ఎక్కువొస్తాయని ప్రశ్నించారు. మన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ఈవీఎంలతో కుమ్మక్కైతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని, అన్నింటికీ మనం మెంటల్ గా సిద్ధపడి ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News