Adilabad District: గజగజ వణుకుతున్న ఆదిలాబాద్ జిల్లా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

  • ఆదిలాబాద్ జిల్లాలో 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలి గాలులే కారణం
  • రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం

ఇరు తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత కారణంగా అక్కడి పాఠశాలల వేళల్లో సైతం మార్పులు చేశారు. ఉత్తర భారతం నుంచి చలి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని... రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా మరో రెండు, మూడు డిగ్రీలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Adilabad District
temparature
  • Loading...

More Telugu News