sensex: అమెరికా ఫెడ్ రేట్ల పెంపు.. మార్కెట్ల లాభాలకు బ్రేక్

  • అంతర్జాతీయ మార్కెట్లపై అమెరికా ఫెడ్ రేట్ల ప్రభావం
  • 52 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 14 శాతం పైగా లాభపడిన నవకార్ కార్పొరేషన్

వరుసగా ఏడు సెషన్ల పాటు లాభాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 36,431కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 10,951 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
నవకార్ కార్పొరేషన్ (14.67%), కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ (10.02%), ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (8.76%), బీఈఎంఎల్ (7.75%), జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ (5.88%).
   
టాప్ లూజర్స్:
గ్రీవ్స్ కాటన్ (-4.17%), అలహాబాద్ బ్యాంక్ (-3.83%), శారద క్రాప్ కెమ్ (-3.77%), టీఐ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (-3.60%), నేషనల్ అల్యూమినియం కంపెనీ (-3.51%).

  • Loading...

More Telugu News