amit shah: అమిత్ షా రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలకత్తా హైకోర్టు

  • పశ్చిమబెంగాల్ రథయాత్రకు సిద్ధమైన అమిత్ షా
  • అనుమతి నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం
  • మూడు రథయాత్రలకు అనుమతించిన హైకోర్టు

పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహింప తలపెట్టిన రథయాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, బీజేపీ శ్రేణులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... రాష్ట్రంలో మూడు రథయాత్రలకు అనుమతించింది. ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రథయాత్రలు చట్టానికి లోబడి ఉన్నప్పుడు వాటిని అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.

amit shah
rath yatra
calcutta
High Court
  • Loading...

More Telugu News