KTR: గెలుపులో పాఠాలు ఉంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి: కేటీఆర్

  • గెలవగానే పొంగిపోవద్దు, అహంకారం నెత్తికెక్కద్దు
  • విజయం సాధించగానే మనకు ఎదురు లేదనుకోవద్దు
  • పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నడవాలి

గెలుపులో పాఠాలు ఉంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ, గెలవగానే పొంగిపోవద్దు, అహంకారం నెత్తికెక్కద్దు, మెజార్టీలు బాగా రాగానే ప్రజలను, కార్యకర్తలను తక్కువగా చూడొద్దన్న మాటను కేసీఆర్ తమకు ఎప్పుడూ చెబుతుంటారని గుర్తుచేసుకున్నారు. గెలుపులో పాఠాలు ఉంటే, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించగానే ఇక మనకు ఎదురు లేదన్న తీరుతో కాకుండా, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నడవాలని సూచించారు. 

KTR
TRS
janagaon
  • Loading...

More Telugu News