Guntur District: నిరుపేదల స్థలాలు వదిలేయండి.. భూకబ్జాదారులకు మావోయిస్టుల హెచ్చరిక!

  • గుంటూరు జిల్లా దాచేపల్లిలో లేఖలు ప్రత్యక్షం కావడంతో కలకలం
  • పేదలకు కేటాయించిన స్థలాలు ఆక్రమిస్తే సహించం
  • లేదంటే ప్రతాపం చూపుతామని బెదిరింపులు

నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలను ఆక్రమించుకుని అనుభవించాలని చూస్తే తమ ప్రతాపం చూపుతామని భూకబ్జాదారులకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఈ హెచ్చరికలతో రూపొందించిన లేఖలు ప్రత్యక్షం కావడం తీవ్రకలకలానికి కారణమైంది. గతంలో కూడా ఇటువంటి లేఖలు విడుదల చేసిన మావోయిస్టులు ఈసారి మన్నెంవారికుంట స్థలాలను ప్రత్యక్షంగా పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేశారు. దొంగ రిజిస్ట్రేషన్లతో స్థలాలను కబ్జా చేసిన వారు తక్షణం పేదల భూములను వారికి అప్పగించాలని, లేదంటే తమ ప్రతాపం చూపుతామని లేఖలో పేర్కొన్నారు.

Guntur District
mavoists
  • Loading...

More Telugu News