Anantapur District: అనంతపురం జిల్లాలో బంగారం, వజ్రాల గనులు: గుర్తించామన్న జీఎస్ఐ

  • ఒక క్యారెట్ కన్నా తక్కువ నాణ్యతతో వజ్రాలు
  • 390 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు ఖనిజం
  • వెల్లడించిన జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్

అనంతపురం జిల్లాలో వజ్రాలు, బంగారు ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్టు జీఎస్ఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) ప్రకటించింది. వజ్రకరూరు ప్రాంతంలోనే వీటిని గుర్తించామని జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌ తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఒక క్యారెట్‌ కంటే తక్కువ నాణ్యతతో వజ్ర ఖనిజాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అనంత పరిధిలోని 390 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు ఖనిజం ఉందని చెప్పారు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా సాల్వనూర్‌ లో వెలుగుచూసిన వజ్రాల ఖనిజ నిక్షేపాల వంటివే అనంతపురంలోనూ ఉన్నాయని వెల్లడించారు.

Anantapur District
Gold
Diamonds
Mines
  • Loading...

More Telugu News