Rajasthan: హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం.. రుణమాఫీని ప్రకటించిన రాజస్థాన్ సీఎం

  • అధికారంలోకి వస్తే పది రోజుల్లోనే రుణమాఫీ అన్న రాహుల్
  • రుణ మాఫీ ప్రకటించి హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్
  • రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో రూ. 2 లక్షల మేర రుణమాఫీ

రాజస్థాన్‌లో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలను వచ్చీ రాగానే నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా బుధవారమే బాధ్యతలు స్వీకరించిన అశోక్ గెహ్లట్ రూ. 2 లక్షల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సోమవారమే రైతు రుణమాఫీని ప్రకటించగా, బుధవారం అశోక్ గెహ్లట్ ప్రకటించారు. రాజస్థాన్‌లో రుణమాఫీ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 18 వేల కోట్ల భారం పడనుంది.

ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోపే రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించి హామీని నిలబెట్టుకున్నాయి.

Rajasthan
Ashok Gehlot
farm loan waiver
Madhya Pradesh
Chhattisgarh
  • Loading...

More Telugu News