ng ranga agriculture university: ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ వీసీపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం

  • వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహామండలి భేటీ
  • వీసీకి వినతిపత్రం ఇవ్వబోయిన సస్పెండైన ఉద్యోగి
  • అందుకు అంగీకరించని వీసీ దామోదరనాయుడు
  • వీసీని దుర్భాషలాడిన చెవిరెడ్డి

తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో రాష్ట్ర స్థాయి వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహామండలి భేటీ ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ వీసీ దామోదరనాయుడు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశం జరుగుతుండగా వీసీకి వినతిపత్రం ఇచ్చేందుకు సస్పెండైన వర్శిటీ ఉద్యోగి అక్కడికి వెళ్లారు. కోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్నందున వినతిపత్రం స్వీకరించేందుకు వీసీ అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ఆ వినతిపత్రం స్వీకరించాలంటూ వీసీపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండైన ఉద్యోగి ఇది వరకే పలుమార్లు తనకు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇదేదీ పట్టించుకోని చెవిరెడ్డి వీసీపై దుర్భాషలాడారు. సమ్మెలో ఉన్న వ్యవసాయ విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. వీసి దామోదరనాయుడిని తొలగించాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఈ సందర్భంగా చెవిరెడ్డిని చర్చలకు రావాల్సిందిగా వీసీ, పాలకమండలి సభ్యులు ఆహ్వానించినప్పటికీ, వారి ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. 

ng ranga agriculture university
vc
damodara naidu
mla chevi reddy
  • Loading...

More Telugu News