Gujarath: ప్రియులతో కలిసి భర్తను వేధించిన మహిళ.. టార్చర్ తట్టుకోలేక కరెంట్ వైర్లు పట్టుకుని భర్త ఆత్మహత్య!

  • గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
  • ముగ్గురు ప్రియులతో భార్య అక్రమ సంబంధం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

వివాహ బంధాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియులతో కలిసి భర్తను వేధించింది. చివరికి ఈ టార్చర్ హద్దు దాటడంతో బాధితుడు కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్ లోని రాజ్ కోట్ నగరంలో చోటుచేసుకుంది.

రాజ్ కోట్ లోని గాంధీరామ్ ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్బాయి మహేశ్వరి దంపతులు ఉంటున్నారు. అయితే నర్సింహ్, రవిశంకర్, మహేశ్ లతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహేశ్వరి భర్తను వేధించసాగింది. ఆమెకు ముగ్గురు ప్రియులు తోడయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ప్రహ్లాద్, కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. తీవ్ర విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రహ్లాద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యతో పాటు ఆమె ముగ్గురు ప్రియులపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులు ప్రహ్లాద్ ఇంటికి తరచుగా వచ్చేవారనీ, బాధితుడిని బెదిరించేవారని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

Gujarath
rajkot
extra martial affair
wife
current wires
suicide
  • Loading...

More Telugu News