shankar: 'భారతీయుడు 2' కోసం కమల్ కసరత్తు

  • శంకర్ నుంచి 'భారతీయుడు 2'
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • 2020 సంక్రాంతికి విడుదల  

శంకర్ .. కమల్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఈ ఇద్దరూ అప్పుడే అనుకున్నారు. కానీ ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. ఇప్పుడు ఆ  సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నెల 14వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టవలసి వుంది. కానీ భారీ సెట్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో, జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లాలని శంకర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శంకర్ చెప్పిన లుక్ కోసం కమల్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారట. ఆయన ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నారని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు

  • Loading...

More Telugu News