Rahul Gandhi: మూడు రాష్ట్రాల విజయాన్ని ప్రియాంకతో కలసి ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ!

  • ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు
  • మూడు రాష్ట్రాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
  • సేదదీరేందుకు సిమ్లాకు చేరుకున్న రాహుల్ గాంధీ
  • వెంట ప్రియాంక, ఆమె పిల్లలు కూడా

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న ఆనందాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంకా గాంధీ, ఆమె పిల్లలతో కలసి అనుభవిస్తున్నారు. ఎడతెగని పర్యటనలు, ఆపై ముఖ్యమంత్రుల ఎంపిక పూర్తయిన తరువాత, రాహుల్, ప్రియాంకలు ప్రస్తుతం సిమ్లాలో సేదదీరుతున్నారు. మంగళవారం సాయంత్రం వారు ఇక్కడకు చేరుకున్నారు.

వీరు రోడ్డు మార్గాన వస్తూ.. మధ్యలో సోలన్ సమీపంలో ఓ దాబా దగ్గర ఆగి స్నాక్స్, మాగీ నూడిల్స్ తిని ముందుకు సాగారు. రాహుల్ ఉన్నారని తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడికి రాగా, కాసేపు వారితోనూ, అక్కడి మహిళలతోనూ రాహుల్ మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందని ఆరా తీశారు.

అక్కడే తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, ఈ పర్యటన తన వ్యక్తిగతమని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, సిమ్లాలోని చహారబ్రా ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ లో వీరు బస చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్వీందర్ సుఖు తెలిపారు. రాహుల్ వస్తున్నట్టు అధికారిక సమాచారం ఏదీ తమకు ముందుగా తెలియదని, ఆయన వచ్చిన తరువాతనే ఏర్పాట్లు చేశామని అన్నారు.

Rahul Gandhi
Himachal Pradesh
Simla
Priyaanka Gandhi
  • Loading...

More Telugu News