parliament: పార్లమెంటులో దీక్ష విరమించిన రామ్మోహన్ నాయుడు.. నిమ్మరసం ఇచ్చిన మురళీమోహన్!

  • కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరశనకు దిగిన టీడీపీ నేత
  • సంఘీభావం తెలిపిన గల్లా, మురళీమోహన్
  • కేంద్రంపై పోరాటం ఆగబోదని స్పష్టీకరణ

తెలుగుదేశం పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ ఆయన నిరశనకు దిగారు. రామ్మోహన్ నాయుడికి మద్దతుగా టీడీపీ నేతలు మురళీమోహన్, గల్ల జయదేవ్ దీక్షలో కూర్చున్నారు. కాగా, పార్లమెంటు సమావేశాలు ఈరోజు ముగిసిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు దీక్ష విరమించారు. టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ నిమ్మరసం ఇచ్చి రామ్మోహన్ చేత దీక్షను విరమింపజేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు, విభజన హమీలను అమలు చేసేవరకూ కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

parliament
Andhra Pradesh
New Delhi
rammohan naidu
murli mohan
mps
agitation
protest
  • Loading...

More Telugu News