InfinityNSeries: మైక్రోమ్యాక్స్ 'ఇన్ఫినిటీ ఎన్' సిరీస్ స్మార్ట్ ఫోన్ విడుదల.. భారీ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో!

  • ఇన్ఫినిటీ ఎన్11, ఇన్ఫినిటీ ఎన్12 విడుదల 
  • ఈనెల 25 నుండి అందుబాటులోకి 
  • రూ.2200 క్యాష్ బ్యాక్, 50 జీబీ డేటా ఉచితం

మొబైల్ దిగ్గజ సంస్థ మైక్రోమ్యాక్స్ 'ఇన్ఫినిటీ ఎన్' సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేసింది. ఇన్ఫినిటీ ఎన్11, ఇన్ఫినిటీ ఎన్12 పేరిట విడుదలైన ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో భారీ బ్యాటరీ ( 4000ఎంఏహెచ్), డ్యూయల్ కెమెరాలతో పాటు మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ ని అమర్చారు. మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్11 ఫోన్ ధర రూ.8,999 ఉండగా, మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్12 ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఈనెల 25 నుండే విక్రయానికి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో వినియోగదారులు రూ.2200 క్యాష్ బ్యాక్ తో పాటు రూ.198, రూ.299 రీఛార్జ్ లపై 50 జీబీ డేటాని ఉచితంగా పొందనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News