Andhra Pradesh: పుట్టినరోజు వేళ పార్లమెంటులో టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు నిరాహార దీక్ష !

  • ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరశన
  • మద్దతు తెలిపిన టీడీపీ నేతలు
  • వంగపండు వేషధారణలో శివప్రసాద్ నిరసన

తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఈరోజు పార్లమెంటు ముందు నిరహార దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలికి వ్యతిరేకంగా నిరశనకు దిగారు. తన పుట్టినరోజు వేళ పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు కూర్చుని ఆందోళన చేపట్టారు. కాగా నిరాహార దీక్షకు దిగిన రామ్మోహన్ నాయుడికి టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు.

అంతకుముందు ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ రావు వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన  టీడీపీ నేత ఎన్.శివప్రసాద్ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. తొలుత ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న మోదీ, ఆ తర్వాత మాత్రం ప్యాకేజీ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. చివరికి ప్యాకేజీని సైతం గాలికి వదిలేసి లీకేజీగా మార్చారని ఎద్దేవా చేశారు. 2019లో మోదీకి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telugudesam
rammohan naidu
agitation
parlaiment
  • Loading...

More Telugu News