Uttar Pradesh: వరుడికి వేయాల్సిన దండను పక్కింట్లో ఉన్న ప్రియుడి మెడలో వేసిన వధువు!

  • ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర ఘటన
  • మైనర్ ను ప్రేమించిన యువతి
  • వరుడికి వేయాల్సిన దండ ప్రియుడి మెడలో
  • వధువు చెల్లితో వరుడి వివాహం

ఉత్తరప్రదేశ్ లోని ఉత్రౌలీ ప్రాంతంలో వివాహ వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వరుడి మెడలో పూలమాల వేయాల్సిన సమయంలో వధువు తీసుకున్న నిర్ణయం ఆమె చెల్లి పెళ్లి జరిగేలా చేయగా, ఆమె పెళ్లి మాత్రం ఆగిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వధువు పక్కింట్లో నివాసం ఉండే ఓ యువకుడిని ప్రేమించింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించగా, వరమాల వేసే సమయంలో పరుగు లంఘించుకుని పక్కింటికి వెళ్లి, తాను ప్రేమించిన వ్యక్తి మెడలో దాన్ని అలంకరించింది.

తనకు కాబోయే భార్య చేసిన పనితో వరుడు తీవ్ర ఆగ్రహానికి గురికాగా, వధువు చెల్లితో అతని పెళ్లిని నిశ్చయించారు పెళ్లి పెద్దలు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు, వధువు ప్రేమించింది ఓ మైనర్ నని తెలుసుకుని, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆపై చెల్లిలి వివాహం వైభవంగా జరుగగా, ఆమె వివాహం మాత్రం ఆగిపోయింది.

Uttar Pradesh
Marriage
Lover
Garland
Bride
Bridegroom
  • Loading...

More Telugu News