Hema: మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఇంటిముందు యాంకర్ హేమ మౌనపోరాటం!

  • సహజీవనం తరువాత వివాహం చేసుకున్న హేమ, నవతేజ్
  • కుమారుడిని తీసుకెళ్లిన నవతేజ్ తల్లిదండ్రులు
  • ఇంటి ముందు నిరసనకు దిగిన హేమ

కొంతకాలం సహజీవనం చేసి, ఆపై పెళ్లి చేసుకుని, ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తూ, జూనియర్ ఆర్టిస్ట్ నవతేజ్ భార్య, టీవీ యాంకర్ హేమ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మౌనపోరాటానికి దిగింది. హేమ వెల్లడించిన కథనం ప్రకారం, ఆత్మకూరుకు చెందిన నవతేజ్ జూనియర్ ఆర్టిస్టుగా ఉండగా, అప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలుండి, భర్తకు దూరమై జూనియర్ ఆర్టిస్టుగా, టీవీ యాంకర్ గా పని చేస్తున్న హేమ అతనికి పరిచయమైంది.

 వీరిద్దరి స్నేహం తొలుత సహజీవనంగా మారగా, ఆపై గత సంవత్సరం ఆగస్టు 4న హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని అంగీకరించని నవతేజ్ తల్లిదండ్రులు, కుమారుడిని తమ వెంట తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరుకు వచ్చిన హేమ, నవతేజ్ ఇంటిముందు మౌన దీక్షకు దిగగా, తన తల్లిదండ్రులతో కలసి నవతేజ్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఆపై పోలీసు స్టేషన్ కు వెళ్లిన నవతేజ్, తాను హైదరాబాద్ కు వెళుతున్నానని చెప్పగా, అక్కడి స్టేషన్ లో లొంగిపోవాలని ఎస్సై నరేష్ వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న హేమ స్టేషన్ కు రాగా, హైదరాబాద్ కు వెళ్లాలని, అక్కడ పోలీసు స్టేషన్ కు నవతేజ్ వచ్చి చర్చించకుంటే, తాము అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో హేమ తన దీక్ష విరమించి తిరిగి హైదరాబాద్ కు పయనమైంది.

Hema
Navatej
Marriage
Police
Nellore District
Atmakur
  • Loading...

More Telugu News