Andhra Pradesh: టీడీపీ నేత చింతమనేనికి తీవ్ర అవమానం.. ఎమ్మెల్యేను అని చెప్పినా కారును విడిచిపెట్టని టోల్ సిబ్బంది!

  • తనకు మినహాయింపు ఉందన్నా వినిపించుకోని వైనం
  • తీవ్ర అసహనానికి లోనైన టీడీపీ నేత
  • కారును అక్కడే వదిలేసి బస్సులో ప్రయాణం

టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు తీవ్ర అవమానం జరిగింది. ఆయన వెళుతున్న కారును టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేను అని స్వయంగా చింతమనేని చెప్పినా అక్కడి సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో చింతమనేని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేను అనీ, తనకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని గుర్తుచేశారు. అయితే సిబ్బంది మాత్రం డబ్బులు చెల్లించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో చింతమనేని సహనం కోల్పోయారు. తన కారును టోల్ గేట్ వద్ద వదిలేసి అటుగా వెళుతున్న బస్సు ఎక్కివెళ్లిపోయారు.

Andhra Pradesh
Guntur District
mla
Chinthamaneni Prabhakar
tollplaza
  • Loading...

More Telugu News