Andhra Pradesh: ఏపీ పెళ్లి కుమార్తెలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త!

  • ఇతర రాష్ట్రాల అబ్బాయిలను పెళ్లాడినా పథకం వర్తింపు
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని విస్తరించిన ప్రభుత్వం

చంద్రన్న పెళ్లి కానుకను కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకూ విస్తరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఏపీ అమ్మాయిలను పెళ్లి చేసుకునే యానాం అబ్బాయిలకు కూడా చంద్రన్న పెళ్లి కానుకను వర్తింపజేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పథకం అమలు కోసం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లకు సింగిల్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి మార్గదర్శకాలను విడుదల చేశారు. యానాం ఒక్కటే కాదు.. ఏపీ అమ్మాయిలను ఇతర రాష్ట్రాల అబ్బాయిలు పెళ్లాడినా ఈ పథకాన్ని వర్తింపజేయాలని, పెళ్లి కానుకను అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Andhra Pradesh
Marriage
Chandranna pelli kanuka
Chandrababu
Yanam
  • Loading...

More Telugu News