Hanuma Vihari: ఆదుకుంటారనుకున్న విహారి, పంత్ అవుట్... ఓటమి అంచున భారత్!

  • 28 పరుగులు చేసి అవుట్ అయిన విహారి
  • 30 పరుగులు చేసి పెవిలియన్ కు రిషబ్ పంత్
  • భారత్ స్కోరు 137/7

పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజున నిలదొక్కుకుని, జట్టును విజయతీరాలకు చేరుస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్న హనుమ విహారి, రిషబ్ పంత్ లు అవుట్ కావడంతో భారత్ ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయింది. 47వ ఓవర్ ను స్టార్క్ వేయగా, అప్పటికి 28 పరుగులు చేసివున్న విహారి, హారిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ దారి పట్టాడు.

 ఆపై 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్ లో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ తరఫున పోరాడేందుకు బౌలర్లు మాత్రమే మిగిలిన పరిస్థితి వుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు కాగా, ఇండియా గెలవాలంటే మరో 150 పరుగులు చేయాలి. మూడు వికెట్లు సాధిస్తే విజయం ఆస్ట్రేలియాను వరిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత్ గెలవడం దాదాపు అసాధ్యమే.

Hanuma Vihari
Rishab pant
India
Australia
Cricket
  • Loading...

More Telugu News