Madhya Pradesh: ఎప్పటికైనా సీఎం అవుతావు... మేనల్లుడు జ్యోతిరాదిత్యను అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన వసుంధరా రాజే!

  • మధ్యప్రదేశ్ లో బీజేపీ ఓటమికి కృషి చేసిన జ్యోతిరాదిత్య సింథియా
  • జైపూర్ లో నిన్న సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం
  • మేనల్లుడిని ఆశీర్వదించిన జ్యోతిరాదిత్య

మధ్యప్రదేశ్ లో బీజేపీని ఓడించడానికి తన శాయశక్తులా కృషి చేసిన జ్యోతిరాదిత్య సింథియాకు, తన మేనత్త, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే నుంచి పొగడ్తలు, ఆశీర్వాదాలు లభించాయి. వీరి రెండు కుటుంబాల మధ్యా దశబ్దాలుగా ఉన్న శత్రుత్వానికి తెరదించేలా, అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారోత్సవంలో అరుదైన సన్నివేశం కనిపించింది. జైపూర్ లో ఈ కార్యక్రమం జరుగగా, వసుంధరతో పాటు జ్యోతిరాదిత్య కూడా హాజరయ్యారు.

ఈ సమయంలో తన మేనల్లుడిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించిన వసుంధర, "వయసు చిన్నదే కాబట్టి సీఎం కావడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో తప్పకుండా సీఎం అవుతావు" అని అనడం వినిపించింది. కాగా, మధ్యప్రదేశ్ లో 'గ్వాలియర్ రాజమాత' విజయ రాజే సింథియా కుమార్తె వసుంధరా రాజే కాగా, కుమారుడు మాధవరావు సింధియా తనయుడే జ్యోతిరాదిత్య సింధియా.

Madhya Pradesh
Rajasthan
Vasundhara Raje
Jyotiraditya Sindhiya
  • Loading...

More Telugu News