Telangana: టీఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నించారన్న వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ!

  • పొత్తు కోసం వెంపర్లాడలేదు
  • కలసి కేంద్రంపై పోరాడుదామని కోరాను
  • హోదాను వ్యతిరేకించినందున దూరం జరిగా
  • ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తానేమీ టీఆర్ఎస్ తో పొత్తునకు వెంపర్లాడలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని చూసిందని, టీఆర్ఎస్ అంగీకరించకపోవడంతోనే కాంగ్రెస్ తో కలిశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. పెథాయ్ తుపానుపై అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

తెలుగువారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నందున కలిసి పోరాడదామని మాత్రమే తాను టీఆర్ఎస్ ను కోరానని ఆయన అన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని, అందుకే ఆ పార్టీకి దూరం జరిగానని అన్నారు. తెలుగుదేశం పార్టీ వల్లే రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్, తెలంగాణలోకి పార్టీని రావద్దనడం సరికాదని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ లు వస్తే లేని అభ్యంతరాలు టీడీపీపై ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిపించేందుకు దేశవ్యాప్త ఉద్యమం తేనున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News