Prabhas: సినీ నటుడు ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేసిన అధికారులు!

  • ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌస్
  • రాయదుర్గంలోని సర్వే నంబరు 46లోని భూమి ప్రభుత్వానిదేనంటూ కోర్టు తీర్పు
  • కోర్టు ఆదేశాలతో భూమి స్వాధీనం

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రాయదుర్గంలోని సర్వే నంబరు 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా ఉన్న వివాదం తొలగిపోయింది. ఇది ప్రభుత్వ స్థలమేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సర్వే నంబరులో ప్రభాస్ 2,200 గజాల స్థలంలో గెస్ట్‌హౌస్ నిర్మించాడు. జీవో నంబరు 59 కింద దీనిని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు.  

Prabhas
Tollywood
Telangana
Guest house
Hyderabad
Actor
  • Loading...

More Telugu News