Congress: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో... కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు యావజ్జీవ ఖైదు!
- తీర్పు వెలువరించిన పటియాలా హౌస్ కోర్టు
- లొంగిపోయేందుకు 31 వరకూ గడువు
- మరో రెండు కేసులు పెండింగ్ లోనే
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్, ఈ కేసులో దోషేనని గతంలోనే తేల్చిన న్యాయస్థానం, నేడు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి తీర్పిస్తూ ఆయనకు జీవితఖైదు విధిస్తున్నట్టు తెలిపారు. ఆయన 31వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించారు.
ఈ కేసులో గతంలో యశ్ పాల్ సింగ్ కు మరణశిక్షను, నరేష్ షెరావత్ కు యావజ్జీవ శిక్షను కోర్టు విధించిన సంగతి తెలిసిందే. సజ్జన్ కుమార్ ప్రమేయమున్న మరో రెండు కేసుల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కావాల్సివుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యోదంతం తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగగా, పలువురు సిక్కు వర్గం వారిని దారుణంగా హతమార్చారు.