fethai syclone: తుపాన్‌ నేపథ్యంలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో జోరుగా వర్షాలు

  • నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు ...
  • లోతట్టు ప్రాంతాల జలమయం
  • అప్రమత్తమైన అధికారులు

పెథాయ్‌ తుపాన్‌ నేపథ్యంలో గుంటూరు, విశాఖ జిల్లాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన సహాయక, పునరావాస చర్యలతో సిద్ధమవుతున్నారు. నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కొన్నిచోట్ల సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తుపాన్‌ తీరం దాటుతుండడంతో కోస్తాలో వాతావరణం ఒక్కసారి మారింది. 

fethai syclone
east cost effect
  • Loading...

More Telugu News