Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడికి షాకిచ్చిన ఫేస్‌బుక్!

  • ముస్లింలు లేని దేశాల్లో దాడులు జరగడం లేదు
  • ముస్లింలు ఇజ్రాయెల్‌ను విడిచిపెట్టాలి
  • లేదంటే ‘జ్యూ’లే ఈ దేశాన్ని విడిచిపెట్టాలి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పెద్ద కుమారుడు యెయిర్ నెతన్యాహుకు ఫేస్‌బుక్ షాకిచ్చింది. ముస్లిం వ్యతిరేక పోస్టులు చేసినందుకు ఆదివారం ఆయన ఫేస్‌బుక్ ఖాతాను 24 గంటలపాటు బ్లాక్ చేసింది. పాలస్తీనా దాడులపై యెయిర్ నెతన్యాహు ఓ పోస్టు చేస్తూ ముస్లింలందరూ ఇజ్రాయెల్‌ను విడిచివెళ్లాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఫేస్‌బుక్‌ను ‘డిక్టేటర్‌షిప్’గా అభివర్ణించారు.

‘‘మీకు తెలుసా? ఎక్కడైతే దాడులు జరగడం లేదో అక్కడ ముస్లింలు లేరు. ఐస్‌ల్యాండ్, జపాన్‌లలో ముస్లింలు లేరు కాబట్టే అక్కడ దాడులు జరగడం లేదు’’ అని ప్రధాని కుమారుడు రాసుకొచ్చారు. ‘‘దీనికి రెండే పరిష్కారాలున్నాయి. ఒకటి జ్యూలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం, రెండు ముస్లింలే ఇజ్రాయెల్‌ను వదిలిపెట్టడం’’ అని మరో పోస్టులో పేర్కొన్నారు. ‘‘నేనైతే రెండో ఆప్షన్‌నే ఎంచుకుంటాను’’ అని పేర్కొన్నారు. గురువారం ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. యెయిర్ నెతన్యాహు పోస్టులను తీవ్రంగా పరిగణించిన ఫేస్‌బుక్ ఆయన ఖాతాను 24 గంటల పాటు నిషేధించింది.

  • Loading...

More Telugu News