Warangal: విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల బెంబేలు

  • మంటలకు ఆహుతైన రెండు బోగీలు
  • విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
  • కాజీపేటలో మరమ్మతు

వరంగల్‌లో ఒకే రోజు రెండు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాజీపేట రైల్వే యార్డులో నిలిపి ఉన్న రైలులోని రెండు బోగీలు ఆదివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే విశాఖపట్టణం-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీకి మంటలు వ్యాపించాయి.

విశాఖ నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్ వరంగల్ చేరుకుంటున్న సమయంలో ఏసీ కోచ్‌ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు కాజీపేట రైల్వే అధికారులకు సమాచారం చేరవేశారు. రైలు ఉదయం 6:45 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే అప్పటికే సిద్ధంగా ఉన్న మెకానికల్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం మరమ్మతులు చేసి  7:15 గంటలకు రైలును పంపించారు.

Warangal
Kazipet
Railway station
visakha-nanded
Express Rail
Fire Accident
  • Loading...

More Telugu News