Chandrababu: నేడు జైపూర్‌కు చంద్రబాబు.. అశోక్ గెహ్లట్ ప్రమాణ స్వీకారానికి హాజరు

  • నేడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంల ప్రమాణ స్వీకారం
  • మంత్రులతో కలిసి వెళ్లనున్న చంద్రబాబు
  • కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారానికి అఖిలేశ్, మాయావతి డుమ్మా

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లట్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు జైపూర్ వెళ్లనున్నారు. అలాగే, మధ్యప్రదేశ్ వెళ్లి భోపాల్‌లో కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు కూడా వెళ్లనున్నారు. కాగా, కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరు కావడం లేదు.

Chandrababu
Rajasthan
Madhya Pradesh
Ashok Gehlot
Kamal Nath
  • Loading...

More Telugu News