no phone for year: ఒక్క సంవత్సరం ఫోన్ వాడకుంటే.. రూ.72 లక్షలు ఇస్తాం!: అమెరికా కంపెనీ బంపర్ ఆఫర్

  • పోటీని ప్రకటించిన విటమిన్ వాటర్ సంస్థ
  • కంప్యూటర్, ల్యాప్ టాప్ వాడుకోవచ్చని వెల్లడి
  • జనవరి 8 నుంచి దరఖాస్తుల ఆహ్వానం

మీరు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఎంతసేపు ఉండగలరు? గంట లేదా రెండు గంటలు.. అంతసేపు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటేనే ప్రపంచం తలకిందులు అయినట్లు ఉంటుంది. అయితే ఓ ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటే దాదాపు రూ.72 లక్షలు అందిస్తామని ఓ అమెరికా కంపెనీ చెబుతోంది. ఇందుకోసం ఫోన్ ను 365 రోజులు వాడకూడదని షరతు విధిస్తోంది.

కోకాకోలా కంపెనీ అనుబంధ సంస్థ విటమిన్‌ వాటర్‌ ‘no phone for a year’ పేరిట ఈ పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పోటీ పడేందుకు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విటర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ల ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో పాల్గొనేవారు స్మార్ట్‌ఫోన్‌ లేకుండా సమయాన్ని ఎలా గడుపుతాం? అనే విషయాన్ని సదరు పోటీదారుడు కంపెనీకి వివరించాల్సి ఉంటుంది.

పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్‌ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను ఈ పోటీలో భాగంగా వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే పోటీలో పాల్గొని చివరిదాకా కొనసాగలేని వారి కోసం విటమిన్ వాటర్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. కనీసం 6 నెలల పాటు ఫోన్ వాడకపోయినా రూ.7 లక్షలను ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. అన్నట్లు ఇంట్లో వాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు1996 నాటి సెల్యూలర్ ఫోన్ ను కంపెనీ అందిస్తుంది.

no phone for year
contest
vietmen water
72 lakh rupees
USA
  • Loading...

More Telugu News