Warangal: కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు బోగీల నుంచి ఎగసిపడుతున్న మంటలు

  • నిలిపి ఉన్న రైలులో ఎగసిపడిన అగ్నికీలలు
  • ఆ పక్కనే డీజిల్ ట్యాంకర్లు
  • మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

వరంగల్‌లోని కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలులోని రెండు బోగీల్లో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ రైలు పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకర్లను దూరంగా తరలించారు. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Warangal
kazipet
Fire Accident
Railway police
Telangana
  • Loading...

More Telugu News