Vidyasagar Rao: మెట్‌పల్లిలో టీఆర్ఎస్ నేతల పోస్టు కార్డుల ఉద్యమం

  • విద్యాసాగర్‌రావుకి చాలా మంచి పేరుంది
  • జిల్లా అభివృద్ధి జరుగుతుంది
  • నాలుగు సార్లు ఎన్నుకున్నారు

ముందస్తు ఎన్నికలు ముగిశాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన అధికార పార్టీ నేతలు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మెట్‌‌పల్లిలో టీఆర్ఎస్ నాయకులు పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు.

విద్యాసాగర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజల్లో విద్యాసాగర్‌రావుకి చాలా మంచి పేరుందని.. అందుకే నియోజకవర్గ ప్రజలు ఆయన్ను నాలుగు సార్లు ఎన్నుకున్నారన్నారు. చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోస్ట్ కార్డులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపించారు.

Vidyasagar Rao
KCR
Post Cards
Lord Chennakesava
Jagityal
  • Loading...

More Telugu News