Rajanna Sircilla District: బాత్‌రూమ్‌లో దూరిన ఎలుగుబంటి.. భయాందోళనలకు గురైన జనం!

  • బంధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
  • అటవీ అధికారులకు సమాచారం
  • అడవిలో వదిలేసిన అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఎలుగుబంటి బాత్‌రూమ్‌లోకి దూరి హల్‌చల్ చేసింది. జిల్లాలోని బోయినపల్లి మండలం నీలోజీపల్లిలోని ఆర్‌అండ్‌ కాలనీలోని ఇంటి బాత్‌రూమ్‌లోకి దూరిన ఎలుగుబంటి బీభత్సం సృష్టించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దానిని బంధించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో వేములవాడ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటిని బంధించిన అధికారులు దానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. ఫాజుల్ నగర్ ఫారెస్ట్‌లో వదిలేశారు.

Rajanna Sircilla District
Bath Room
Bear
Vemulavada
  • Loading...

More Telugu News