indrakaran reddy: మైనార్టీ నేతల ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ రెడ్డికి ఘన సత్కారం

  • ఇంద్రకరణ్ కు లడ్డూ మిఠాయిలతో తులాభారం
  • నిర్మల్ లో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
  • ప్రజలు అభివృద్ధిని గెలిపించారు: ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డిని మైనార్టీ విభాగం నేతలు ఘనంగా సత్కరించారు. స్థానిక స్వరాజ్ మహల్ కాలనీకి చెందిన మైనార్టీ విభాగం నేతలు ఈరోజు ఆయన్ని కలిశారు. పూలమాలలు, దుశ్శాలువాలతో ఆయన్ని సత్కరించారు. ఇంద్రకరణ్ కు లడ్డూమిఠాయిలతో తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన అభివృద్ధి, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసే ప్రజలు తమకు ఓట్లు వేశారని, టీఆర్ఎస్ కే మళ్లీ పట్టం కట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని గెలిపించారని చెప్పారు. నిర్మల్ లో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.   

indrakaran reddy
nirmal
TRS
tulabharam
  • Loading...

More Telugu News