Andhra Pradesh: హైదరాబాద్ లో కారు బీభత్సం.. ఓ యువకుడి దుర్మరణం, ముగ్గురికి తీవ్రగాయాలు!

  • పెద్దఅంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డులో ఘటన
  • అదుపు తప్పి బైక్ లపైకి దూసుకెళ్లిన కారు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు బైక్ లపైకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

మరోవైపు అటుగా వెళుతున్న ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Telangana
Hyderabad
Road Accident
car
two bikes
Police
case
hospital
  • Loading...

More Telugu News