prabhas: ఫ్యాన్స్ కోరుకున్నదే .. మరోసారి ప్రభాస్ జోడీగా అనుష్క!

  • 'బాహుబలి'తో అలరించిన జంట 
  • ఆ తరువాత కుదరని కాంబినేషన్ 
  • త్వరలో తీరనున్న ఫ్యాన్స్ ముచ్చట   

ప్రభాస్ .. అనుష్క ఇద్దరూ కూడా 'మిర్చి' .. 'బిల్లా' సినిమాల్లో కలిసి చేశారు. ఆ తరువాత వచ్చిన 'బాహుబలి'తో ఈ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి పెళ్లి గురించి వచ్చిన వార్తలు ఈ క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. ఈ జంటను మళ్లీ తెరపై చూడటానికి అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఆ ముచ్చట తీర్చడం కోసమేనన్నట్టుగా ఈ ఇద్దరూ మరోసారి జోడీ కడుతున్నారు .. అదీ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కోసం.'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో కీలకమైన మరో హీరోయిన్ పాత్ర కూడా వుందట. ఈ పాత్ర కోసమే అనుష్కను తీసుకున్నారని తెలుస్తోంది. ప్రభాస్ .. అనుష్కలపై కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టుపై పెరిగే అంచనాలను అడ్డుకోవడం కష్టమే. 

  • Loading...

More Telugu News