Raja singh: గో హత్యలు చేసే వారిని బతకనివ్వను: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

  • బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మల్యే
  • వచ్చే ఐదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలకే అంకితం
  •  ఉదయం 10 గంటలకు విజయోత్సవ ర్యాలీ

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేటి ఉదయం విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపిన ఆయన.. గోహత్యలు చేసే వారిని బతకనివ్వబోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి తన గెలుపును అడ్డుకునేందుకు కొందరు చివరి వరకు ప్రయత్నించారని ఆరోపించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే అంకితమవుతానన్న ఆయన నేటి ఉదయం 10 గంటలకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.

Raja singh
BJP
Telangana
Goshamahal
cow slaughter
Hyderabad
  • Loading...

More Telugu News