Karnataka: కర్ణాటకలో దేవుడి ప్రసాదం తిని 10 మంది మృతి.. పలువురు ఆసుపత్రి పాలు!

  • చామరాజనగర్‌ జిల్లాలో దుర్ఘటన 
  • దేవాలయం గోపుర నిర్మాణానికి అంకురార్పణ కార్యక్రమం 
  • కలుషితమైన ప్రసాదం పంపిణీ

దేవుడి ప్రసాదం కలుషితం కావడంతో అది తిన్న ఐదుగురు మృతి చెందగా.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన కర్ణాటకలో సంచలనం స‌ృష్టించింది. రాష్ట్రంలోని చామరజనగర్‌లోని కిచ్చలవాడి గ్రామంలోని మారమ్మ దేవాలయంకు సంబంధించిన గోపుర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.

ఈ సందర్భంగా భక్తులకు పంచిన ప్రసాదం తిన్న వారిలో పది మంది మృతి చెందారు. 80 మంది తీవ్ర అస్వస్థత పాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రసాదంగా పంచిన టమాటా రైస్ దుర్వాసన వస్తోందని, దాంతో కొంత మంది పారేయగా, మరికొందరు తినేశారని అక్కడి భక్తులు చెప్పారు.

ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్య సదుపాయాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే, ఈ ప్రసాదంలో ఎవరినా విషం కలిపారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Karnataka
Poison
5 Dead
Hospital
  • Loading...

More Telugu News