Telangana: తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలు మనమే గెలవాలి: సీఎం కేసీఆర్

  • ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇంఛార్జిలు
  • ఒక్కో నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలు
  • కొత్త కేబినెట్ లో సమర్థులైన మంత్రులే ఉంటారు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలు మనమే గెలవాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్య వర్గ సమావేశం ముగిసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ బాధ్యులను ఇంఛార్జిలుగా నియమిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీల నియామకం జరగాలని, కార్యాలయాల్లో శాఖల వారీగా సమాచారం అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త కేబినెట్ లో సమర్థులైన మంత్రులే ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు.

Telangana
TRS
mp seats 16
  • Loading...

More Telugu News