Andhra Pradesh: 'ధర్మం గెలవడం మొదలైంది... దొరా నీకు వందనం' భీమవరంలో వైకాపా నేతల కేసీఆర్ ఫ్లెక్సీ!

  • ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ ను అభినందిస్తూ ప్లెక్సీలు
  • భీమవరం రహదారిపై వెలసిన ప్లెక్సీ
  • ఆసక్తిగా చూస్తున్న వాహనదారులు

ఇప్పుడు ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ ను అభినందిస్తూ ప్లెక్సీలు వెలుస్తున్నాయి. తాజాగా పాలకోడేరు నుంచి భీమవరం వెళ్లే ప్రధాన రహదారిపై కుముదవల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు ప్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

"ధర్మం గెలవడం మొదలైంది... దొరా నీకు వందనం" అంటూ దానిపై రాశారు. కేసీఆర్, వైఎస్ జగన్ ఫోటోలను ముద్రించారు. ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ ప్లెక్సీని ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసీఆర్ ప్లెక్సీలు చాలానే కనిపిస్తుండగా, నరసాపురంలో కొందరు ఏర్పాటు చేసిన ప్లెక్సీని అధికారులు తొలగించడంతో వివాదం నెలకొంది.

Andhra Pradesh
KCR
Plexi
YSRCP
  • Loading...

More Telugu News