Anantapur District: దప్పికగా ఉందని మంచినీళ్లడిగాడు... తెచ్చిచ్చిన మహిళపై అత్యాచారయత్నం!

  • అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ఘటన
  • చికెన్ తినడంతో దప్పికగా ఉందని వచ్చిన వ్యక్తి
  • కేకలు విని వస్తున్న స్థానికులను చూసి ఉడాయింపు

అర్ధరాత్రి మంచినీరు కావాలంటూ వచ్చిన ఓ వ్యక్తి, నీరు తెచ్చిన మహిళపై అత్యాచారయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని మల్కాపురం గ్రామంలో జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, భర్త చనిపోయిన ఓ ఒంటరి మహిళ, కుమారుడితో కలసి ఉండగా, అదే గ్రామానికి చెందిన బిల్లే శివయ్య ఆమెపై కన్నేశాడు.

బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని, ప్రహరీ గోడదూకి వెళ్లి తలుపు తట్టాడు. లోపలి నుంచి బాధితురాలు ప్రశ్నించగా, తాను చికెన్‌ తిన్నానని, దప్పికగా ఉందని, మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఆమె తలుపు తీసి నీరివ్వబోగా, ఆమెపై అత్యాచారానికి దిగాడు. ఆమె పెద్దగా అరుస్తూ కేకలు వేయడంతో, స్థానికులు రావడాన్ని చూసి, పరారయ్యాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ధర్మవరం రూరల్‌ పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Anantapur District
Dharmavaram
Rape Attempt
Widow
  • Loading...

More Telugu News