KCR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్... నమ్మకస్తుడు, సమర్థుడికే ఇచ్చానన్న కేసీఆర్

  • ఉత్తర్వులు వెలువరించిన కేసీఆర్
  • అత్యంత నమ్మకస్తునికే బాధ్యతలిచ్చా
  • కేటీఆర్ సమర్థుడన్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కె.తారకరామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమిస్తూ, అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందని, అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికే తాను పార్టీ బాధ్యతలను అప్పగించానని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ కే అప్పగించినట్టు ఆయన తెలిపారు. గడచిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ తరఫున విస్తృతంగా పర్యటించిన నేత కేటీఆరే. కొడంగల్ వంటి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం వెనుక ఆయన పన్నిన వ్యూహ ప్రతివ్యూహాలు ఎంతో కీలకమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లోనూ కేటీఆర్ ఎంతో ప్రచారం చేసి, టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి బాటలు వేశారు. కాగా, దేశ రాజకీయాలవైపు చూస్తున్న కేసీఆర్, రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠం చేసే ఆలోచనలో భాగంగానే తన కుమారుడికి కీలక బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది.

KCR
KTR
TRS
Working President
  • Loading...

More Telugu News