tirumara: 'మిరాశీ అర్చకులకు పదవీ విరమణ' కేసులో టీటీడీకి ఎదురుదెబ్బ

  • పదవీ విరమణ లేకుండా వీరిని కొనసాగించాలి
  • హైకోర్టు తీర్పుపై మిరాశీ అర్చకుల హర్షం
  • సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో టీటీడీ

'మిరాశీ అర్చకులకు పదవీ విరమణ' కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఎదురుదెబ్బ తగిలింది. మిరాశీ అర్చకులకు పదవీ విరమణ లేకుండా వారిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై మిరాశీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇప్పటికే తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, తిరుచానూరు అమ్మవారి ఆలయాల్లో రిటైర్మెంట్ నిబంధనను టీటీడీ అమలు చేసింది. దీనిని నిరసిస్తూ తిరుచానూరు ఆలయ మిరాశీ వంశీకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో టీటీడీ ఉన్నట్టు సమాచారం. 

tirumara
tirupati
tiruchanuru
govindaraja swamy
temples
mirasi
High Court
  • Loading...

More Telugu News