ap: ఏపీలో దారుణం.. స్టాఫ్ నర్సును కత్తితో పొడిచి చంపిన దుండగులు

  • సత్యవతి అనే స్టాఫ్ నర్స్ దారుణ హత్య
  • బుట్టాయిగూడెం బస్టాండ్ వద్ద హతమార్చిన దుండగులు
  • పులిరామన్నగూడెం పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న సత్యవతి

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అనే స్టాఫ్ నర్సును గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. పులిరామన్నగూడెం పీహెచ్సీలో ఆమె స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. బుట్టాయిగూడెం బస్టాండ్ వద్ద ఆమెను దారుణంగా హతమార్చారు. ఈ ఉదయం మృతదేహాన్ని చూసిన పలువురు ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరిచారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. 

ap
staff nurse
satyavathi
murder
  • Loading...

More Telugu News