MP sivaprasad: చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ 'గారడీ' వేషం.. పార్లమెంటు ముందు నిరసన

  • ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఎంపీలతో కలిసి ఆందోళన
  • పొట్టకూటి కోసం మాయచేసే వాడు గారడీ వాడు
  • ఓట్ల కోసం మాయ చేసేవాడు మోదీ అంటూ సెటైర్‌

పలు రకాల వేషధారణలతో నిత్యం వార్తల్లో ఉండే చిత్తూరు ఎంపీ, సినీనటుడు శివప్రసాద్‌ గురువారం గారడీ వాడి వేషధారణతో పార్లమెంటు ముందు ఆందోళకు దిగారు. విభజన హామీలు నెరవేర్చకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న మోసానికి నిరసనగా టీడీపీ ఎంపీలు రెండు రోజులుగా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నిరసనలో భాగంగా గురువారం ఆయన గారడీ వేషధారణతో అలరించారు. పొట్టకూటి కోసం గారడీ వాడు విద్యలు ప్రదర్శిస్తే, ఓట్ల కోసం నాడు మోదీ గారడీ విద్యలు ప్రదర్శించారని వ్యంగ్యాస్త్రాలు సంధించి నవ్వులు పండించారు. ఎన్నికల వేళ అవీ, ఇవీ ఇస్తామని చెప్పి తెలుగు ప్రజల ఓట్లు గుంజుకున్న మోదీ ఆ తర్వాత రిక్త హస్తం చూపించారని ఆరోపించారు. మాయమాటలతో గారడీ వాడిని మించి పోయారని విరుచుకుపడ్డారు.

MP sivaprasad
New Delhi
  • Loading...

More Telugu News