Jaggareddy: నన్ను అణగదొక్కేందుకు యత్నించి విఫలమయ్యారు: జగ్గారెడ్డి

  • ఇబ్బందులు పెట్టినా పార్టీ మాత్రం మారను
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
  • కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చెయ్యను

తనను ఇబ్బందులు పెట్టినా పార్టీ మాత్రం మారేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సంగారెడ్డి నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. నేడు ఆయన సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. తనకు సహకారం ఉన్నా.. లేకున్నా నాలుగేళ్ల వరకూ ప్రభుత్వంపై గానీ, కేసీఆర్ కుటుంబం పైన గానీ ఎలాంటి విమర్శలు చేయబోనన్నారు.

తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 17న సంగారెడ్డిలో సభ నిర్వహించనున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తనను మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అణగదొక్కేందుకు యత్నించి విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని అందరూ భావించారని, కానీ ప్రజలు మాత్రం మరోసారి టీఆర్ఎస్‌కు అవకాశమిచ్చారని తెలిపారు.

Jaggareddy
Congress
TRS
KCR
Telangana
Sangareddy'
  • Loading...

More Telugu News