kcr: కేసీఆర్ గెలుపుకు చంద్రబాబు కూడా ఒక కారణమే: నారాయణ

  • కేసీఆర్ ఓడిపోతారని భావించాం
  • సంక్షేమ పథకాల వల్లే టీఆర్ఎస్ గెలిచింది
  • బీజేపీ గడ్డుకాలాన్ని ఎదుర్కోబోతోంది

టీఆర్ఎస్ విజయాన్ని తాము ఊహించలేదని... కేసీఆర్ ఓడిపోతారని భావించామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రైతులతో సహా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వెళ్లడం వల్లే కేసీఆర్ గెలుపు సాధ్యమైందని చెప్పారు. ప్రజాకూటమి ఓటమికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక కారణమేనని అభిప్రాయపడ్డారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో తాము విఫలమయ్యామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

రానున్న రోజుల్లో బీజేపీ గడ్డుకాలాన్ని ఎదుర్కోబోతోందని నారాయణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దీన్నే సూచిస్తున్నాయని చెప్పారు. ఏ ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చలేదని... ప్రజలను భ్రమల్లో ఉంచడం తప్ప ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ వచ్చే అవకాశమే లేదని చెప్పారు.

kcr
TRS
cpi
narayana
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News