Posani Krishna Murali: తెలంగాణలో చంద్రబాబు అడుగుపెట్టగానే.. కొంచెం భయపడ్డా: పోసాని

  • తిమ్మిని బమ్మిని చేసేంత సామర్థ్యం చంద్రబాబుకు ఉంది
  • కానీ, ప్రజలు కేసీఆర్ నే నమ్మారు
  • కేసీఆర్ చేసిన మంచి పనులు ఆయనను అభిమానించేలా చేశాయి

కేసీఆర్ గెలుస్తాడా? లేక కూటమి గెలుస్తుందా? అని ఎన్నికల సమయంలో ఎంతో మంది తనను అడిగారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తెలిపారు. ప్రజల్లో నీతి, నిజాయతీ, మేలు చేసిన వాడికి మంచి చేయాలనే విలువలు ఉంటే కేసీఆరే గెలుస్తారని తాను చెప్పానని అన్నారు. అయితే, ఏపీ నుంచి సైంధవుడిలా, డబ్బు సంచులు తీసుకుని చంద్రబాబు దిగారని... కానీ, ప్రజలు కేసీఆర్ ను మాత్రమే నమ్మారని ప్రశంసించారు. తిమ్మిని బమ్మిని చేసేంత శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయని... అందుకే, ఆయన తెలంగాణలో అడుగుపెట్టగానే తాను కూడా కొంచెం భయపడ్డానని చెప్పారు.

కేసీఆర్ కూడా ఓడిపోతారని రెండో సైంధవుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారని ఎద్దేవా చేశారు. ఒక బక్కవాడ్ని కొట్టడానికి ఇంత మంది వచ్చారని అన్నారు. తాను ఎంతో ప్రేమించే గద్దర్ కూడా కూటమిలోకి రావడంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. తన జీవితంలో కేసీఆర్ ను దగ్గర నుంచి చూసింది కూడా లేదని... కానీ, ఆయన చేసిన మంచి పనులు ఆయనను అభిమానించేలా చేశాయని తెలిపారు.

Posani Krishna Murali
Chandrababu
KCR
Telangana
elections
tollywood
  • Loading...

More Telugu News