suhasini: కూకట్‌పల్లి ప్రజలారా మీతోనే ఉంటా.. సుహాసిని బహిరంగ లేఖ!

  • కూకట్‌పల్లిలో ఓటమి పాలైన సుహాసిని 
  • ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తా
  • ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా

కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన ఓటమిని అంగీకరిస్తూ కూకట్‌పల్లి నియోజక వర్గ ప్రజలకి బహిరంగ లేఖ రాశారు.

'కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ.. నన్ను అతి తక్కువ కాలంలోనే ఆదరించి, అక్కున చేర్చుకున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నన్ను ఆదరించిన కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నేను (కూకట్‌పల్లి) ఇక్కడే ఉండి ప్రజలకి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాను. ఈ ఎన్నికలలో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా' అంటూ సుహాసిని తన లేఖలో తెలిపారు.
 

suhasini
Telugudesam
Telangana
Telangana Election 2018
Telangana Assembly Results
Telangana Assembly Election
  • Loading...

More Telugu News