Telangana: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్!
- అందువల్లే టీఆర్ఎస్ గెలుపొందింది
- క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి
- వీవీ ప్యాట్ లను 100 శాతం లెక్కించండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందువల్లే అధికార టీఆర్ఎస్ భారీగా స్థానాలను గెలుచుకోగలిగిందని విమర్శించింది. నిజాలను నిగ్గు తేల్చడానికి ఆయా నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను పరిశీలించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. వీవీ ప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను 100 శాతం లెక్కించాలని కోరింది. ఈ మేరకు ఓ లేఖను ఈసీకి సమర్పించింది.